సైన్స్ టీచర్ కుటుంబానికి రూ. 50 వేల ఆర్థిక సాయం

558చూసినవారు
సైన్స్ టీచర్ కుటుంబానికి రూ. 50 వేల ఆర్థిక సాయం
చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీర్ గా పనిచేసిన సైన్స్ గురువు జి. నేలకోటప్ప కుటుంబానికి రూ. 50వేల ఆర్థిక చేయూతనిచ్చినట్లు 2000-2001 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు బుధవారం పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ. టీచర్ జి. నేలకోటప్ప బ్రెయిన్ ట్యూమర్ వల్ల మరణించగా, విషయం తెలుసుకున్న పదో తరగతి విద్యార్థులంతా కలిసి రూ. 50 వేలు అందజేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్