హిందూ మహాగణపతి కొత్త కమిటీకి ఆహ్వానం

84చూసినవారు
రాయదుర్గంలో గత ఏడాది మొట్టమొదటిసారిగా హిందూ మహా గణపతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించామని హిందూ మహాగణపతి కమిటీ అధ్యక్షులు గౌని ప్రతాపరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది మరింత వైభవంగా నిర్వహించేందుకు కమిటీలు కొత్త సభ్యులకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. గోసాబావి వినాయక కళ్యాణమండపంలో 11వ తేదీ అనగా మంగళవారం కొత్త కమిటీ కోసం సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.