టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మెగా టోర్నీలో ఓ ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. నిన్న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించి.. ఈ రికార్డ్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకూ భారత్, పాక్ మధ్య మొత్తం 8 మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో పాక్ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధిస్తే.. మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో భారత్ విజయఢంకా మోగించింది.