సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని బొమ్మనహాల్ ఎస్ఐ నబిరసూల్ ప్రజలకు తెలిపారు. ఆదివారం బొమ్మనహల్ పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ నబిరసూల్ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించే క్యాలెండర్ ను విడుదల చేశారు. ఎస్ఐ మాట్లాడుతూ ఆన్లైన్ లో అలాగే ఆన్లైన్ యాప్ల ద్వారా ప్రజలను సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారని ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు.