బాన్సువాడ పట్టణంలోని అన్ని వార్డుల్లో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని 2వ వార్డులో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన బోరు మోటారును ప్రారంభించారు. కొన్ని రోజులుగా నీటి కొరతతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్న దృష్ట్యా బోరు మోటార్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.