గార్లదిన్నె పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ జగదీష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ లో ఉన్న కేసుల గురించి ఆరా తీశారు. కేసుల పురోగతిని తెలుసుకుని తగు సూచనలు చేశారు. రౌడీ షీటర్ కలిగిన వ్యక్తుల వివరాలు తెలుసుకుని వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీసులకు సూచించారు. ఈనెల 14న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాజీ పడదగ్గ కేసులను కౌన్సిలింగ్ చేసి స్వచ్ఛందంగా రాజీ పడేలా చర్యలు తీసుకోవాలన్నారు.