రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు

74చూసినవారు
రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు
రానున్న ఐదు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిరు జల్లులతో కూడిన తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావ రణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయశంకర్ బాబు, నారాయణ స్వామి తెలిపారు. వచ్చే ఐదు రోజులూ పగటి ఉష్ణోగ్రతలు 33. 9 నుంచి 35. 2 డిగ్రీలుగానూ, రాత్రి ఉష్ణోగ్రతలు 23. 5 నుంచి 24. 0 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఉదయం పూట గాలిలో తేమ 76 శాతం, మధ్యాహ్నం పూట 45 శాతం నమోదవుతుందన్నారు.

సంబంధిత పోస్ట్