బ్రహ్మోత్సవాలకు కలెక్టర్ ని ఆహ్వానించిన ఎమ్మెల్యే శ్రావణి

80చూసినవారు
బ్రహ్మోత్సవాలకు కలెక్టర్ ని ఆహ్వానించిన ఎమ్మెల్యే శ్రావణి
శింగనమల నియోగకవర్గంలోని గూగూడు కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ని గురువారం ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లలో భాగంగా పలు అంశాలపై కలెక్టరు కు వినతిపత్రం అందించారు. గూగూడు కు వెళ్లి స్వయంగా పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్