గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణం ప్రాధాన్యమివ్వాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఆదేశించారు. మంగళవారం నార్పల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీరు, వీధిదీపాలు, పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించాలన్నారు. సచివాలయాల్లో ఉద్యోగులు నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు.