అనంతపురం జిల్లాకు వర్ష సూచన

61చూసినవారు
అనంతపురం జిల్లాకు వర్ష సూచన
జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంటలో ఉన్న ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధనాస్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయశంకర్ బాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో రానున్న 5 రోజుల్లో తేలిక పాటి వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 34. 0-38. 2, రాత్రి ఉష్ణోగ్రతలు 21. 8-24. 4 డిగ్రీల సెల్సియస్ నమోదు కావచ్చన్నారు.

సంబంధిత పోస్ట్