విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని శింగనమల సీఐ కౌలుట్లయ్య సూచించారు. గురువారం నార్పలలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు ఏమైన సమస్యలుంటే తన దృష్టికి తీసుకరావాలన్నారు. ఆయన వెంట ఎఎస్ఐ నాగరాజు, కానిస్టేబుల్ సుంకన్న తదితరులు ఉన్నారు.