యల్లనూరు మండలం దుగ్గుపల్లికి చెందిన కిరణ్ (21) అనే యువకుడు మంగళవారం విద్యుత్ షాక్ కు గురై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కిరణ్ తన స్నేహితులతో కలిసి గొడ్డుమర్రి గ్రామంలోని ఓ ఇంటికి వైరింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై కిందపడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం పులివెందుల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.