కుక్కల దాడిలో జింక మృతి..

1052చూసినవారు
కుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన తాడిపత్రిలోని యల్లనూరు రోడ్డులో గురువారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు యల్లనూరు రోడ్డులోని బైపాస్ పక్కన దారి తప్పి వచ్చిన జింకను కుక్కలు వెంబడించి దాడి చేశాయి. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందిందని స్థానికులు తెలిపారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్