ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ముఖ్యమంత్రి భార్య

65చూసినవారు
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ముఖ్యమంత్రి భార్య
సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే ప్రేమ్ సింగ్ తమాంగ్ భార్య కృష్ణ కుమారి రాయ్.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. నామ్చి-సింగితాంగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన ఆమె.. ఇంతలోనే అనూహ్యంగా శాసనసభ సభ్యత్వాన్ని వదులుకోవడం చర్చనీయాంశం అవుతోంది. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్‌కు చెందిన పార్టీ సిక్కిం క్రాంతికారి మోర్చా ఇటీవలి ఎన్నికల్లో 32 అసెంబ్లీ స్థానాల్లో 31 స్థానాలు గెలిచింది.

సంబంధిత పోస్ట్