ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవించండి

60చూసినవారు
ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవించండి
ప్రజలు ప్రశాంతంగా జీవించాలని యాడికి అప్ గ్రేడ్ సీఐ నాగార్జున రెడ్డి సూచించారు. సోమవారం మండలంలోని కోనుప్పలపాడు, కత్తి మానుపల్లె గ్రామాల్లో సీఐ పర్యటించి గ్రామస్తులతో మాట్లాడారు. ఎన్నికలు పూర్తయ్యాయని, ప్రతి ఒక్కరూ సోదర భావంతో ఉండాలన్నారు. గొడవలు పడి కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ కుటంబాలకు దూరమై ఆర్థికంగా నష్టపోయి ఇబ్బందులు పడవద్దని సూచించారు. గొడవలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్