సరైన వాహన పత్రాల్లేని ఐదు వాహనాలు సీజ్

73చూసినవారు
తాడిపత్రి రూరల్ పరిధిలోని అర్జాస్ స్టీల్ ప్లాంట్ లో ఓ గుత్తేదారుడు కార్మికులు, సిబ్బందీని రవాణా చేసేందుకు పెట్టిన బస్సులకు పత్రాలు సరిగా లేకపోవడంతో రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. తాడిపత్రి ఎంవీఐ శ్రీనివాసులు ఆ వివరాలను వెల్లడించారు. పరిశ్రమలో గుత్తేదారుడు ఏర్పాటు చేసిన 3 బస్సులకు, 2 టిప్పర్లకు పర్మిట్లు, ఎఫ్సీలు లేకపోవడంతో వాటిని సీజ్ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్