రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు

55చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు
యాడికి మండల కేంద్రంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కోనుప్పలపాడు గ్రామానికి చెందిన లక్ష్మినారాయణ పని నిమిత్తం బైక్ లో యాడికికి వచ్చాడు. పనుల అనంతరం స్వగ్రామానికి బయలుదేరాడు. భైరవకొండ సమీపాన అడవిపంది వేగంగా ఢీకొనడంతో బైక్ అదుపు తప్పి కింద పడింది. ప్రమాదంలో లక్ష్మినారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు.

సంబంధిత పోస్ట్