తాడిపత్రి లో వర్షంతో .. జలమయం

63చూసినవారు
తాడిపత్రిలో బుధవారం రాత్రి, గురువారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. ప్రధానంగా అంబేడ్కరనగర్, సీబీ రోడ్డులోని చోట్ల, కృష్ణాపురం రోడ్డు, కూరగాయల మార్కెట్, సుంకుల మ్మపాళెంలో భారీ ఎత్తున వర్షపు నీరు నిలబడింది. దిగువ ప్రాంతాల్లో వర్షపు నీరు ఆగడంతో ఆయా కాలనీవాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పలు చోట్ల మ్యాన్హాళ్లు పూర్తిగా మూసుకుపోవడంతో నీరంతా రహదారుల పైనే నిలబడిపోయింది.

సంబంధిత పోస్ట్