తాడిపత్రిలో ల్యాబ్ ను, హెల్త్ సెంటర్ ను తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీనివాసులు శనివారం తనిఖీ చేశారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ ల్యాబ్ వివరాలను ఎప్పటికప్పుడు రికార్డులలో నమోదు చేయాలన్నారు. తప్పుగా వివరాలను నమోదు చేయరాదని, విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.