తాడిపత్రి ఆర్డిటి క్యాంపునకు చెందిన బురానుద్దీన్, లిఖిత్ కుమార్ రెడ్డి యు-12 జిల్లా క్రికెట్కు ఎంపికయ్యారు. అనంతపురంలో జరిగిన ప్రాబబుల్స్ మ్యాచుల్లోమ్యాచ్లలో ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు ఎంపికయ్యారు, జనవరి 6 నుంచి 12 వరకు కడపలో జరిగే యు-12 ఇంటర్ జిల్లా క్రికెట్ మ్యాచ్లో పాల్గొననున్నట్లు కోచ్ భార్గవ్ తెలిపారు. ఎంపికపై ఏటిఎల్ లలిత, తాడిపత్రి సెక్రటరీ సాదిక్ వలి, సీనియర్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.