అసాంఘిక కార్యకలాపాలపై తాడిపత్రి రూరల్ పోలీసులు నిఘా పెంచారు. పట్టణ పరిసరాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచి నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు. అందులో భాగంగా సోమవారం ఆటో నగర్ సమీపంలో బహిరంగంగా మద్యం తాగుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. ఎవరైనా జూదం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగినా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.