వైకాపా న్యాయవాది పెద్ద తప్పే పట్టుకున్నాడు

587చూసినవారు
నామినేషన్ల పరిశీలన సందర్భంగా వైకాపాకు చెందిన న్యాయవాది పెద్ద తప్పే పట్టుకున్నాడని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. నామినేషన్ల పరిశీలన అనంతరం ఆయన బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడారు. బీ-ఫాంలో తెలుగుదేశం ఆనే పదంలో ఇంగ్లీష్ అక్షరం తప్పుందని వైకాపా లాయర్ అభ్యంతరం తెలిపారన్నారు. తాడిపత్రిలోనే కాకుండా 175 నియోజకవర్గాల్లో కూడా ఇదే తప్పు ఉంటుందన్నారు. తాడిపత్రి పదంలో కూడా ఇంగ్లీష్ అక్షరం తప్పుగా ఉందని, అక్కడ నామినేషన్ వేసిన అందరివీ తప్పే ఉంటుందని ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్