యాడికి: మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం

58చూసినవారు
యాడికి: మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం
మత్తు పదార్థాల వాడడం వల్ల జీవితాలు నాశనమవుతాయని యాడికి యూపీఎస్ సీఐ ఈరన్న తెలిపారు. శనివారం మండలంలోని రాయలచెరువు హైస్కూల్లో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు, మత్తుపదార్థాలు వాడడం వలన జీవితాలు నాశనమవుతాయన్నారు. మత్తు పదార్థాలు వాడేవారు తీవ్ర అనారోగ్యపాలవుతారని, క్యాన్సర్ వంటి రోగాలకు గురికాక తప్పదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్