అక్రమంగా తరలిస్తున్న 49 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం సీజ్ చేసినట్లు సీఐ ఈరన్న తెలిపారు. మంగళవారం యాడికి లోని కోనరోడ్డులో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని, ఆటోను పట్టుకున్నారు. 49 క్వింటాళ్ల బియ్యంను స్వాధీనంచేసుకున్నారు. నారాయణ స్వామి, మహేంద్ర, క్రిష్ణ, రఘురాముడు, సుంకన్నలపై కేసు నమోదు చేసి, సీజ్ చేసిన బియ్యాన్ని సివిల్ సప్లయ్స్ అధికారులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు.