యాడికి: కుటుంబ కలహాలతో ఉరేసుకొని మహిళ ఆత్మహత్య

56చూసినవారు
యాడికి: కుటుంబ కలహాలతో ఉరేసుకొని మహిళ ఆత్మహత్య
కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన బుధవారం యాడికిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు యాడికిలోని కమలపాడు రోడ్డులో ఉంటున్న మహానందరెడ్డి, వెంకటేశ్వరమ్మ(36) దంపతులు నివసిస్తున్నారు. ఇటీవల దంపతుల మధ్య గొడవలు జరిగాయి. ఈక్రమంలో భార్య ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుంది. మృతురాలి తల్లి నారాయణమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్