తనకల్లు మండలంలో వీర జవాన్ లకు బీజేపీ నివాళి

264చూసినవారు
కుదిరితే ఓ కన్నీటి చుక్క లేదా ఓ పది రూపాయలు

తనకల్లు మండలంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చఅధ్యక్షుడు సోము రాయల్ ఆధ్వర్యంలో గత సంవత్సరం ఫిబ్రవరి 14న ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన నలభై మంది సైనికులకు నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నతనకల్లు మండల ఇన్చార్జి జి వెంకటేష్ మాట్లాడుతూ . ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కాదు, దేశాన్ని ప్రేమించి ప్రాణాలు తృణప్రాయంగా బలిదానం చేసిన వీర జవాన్ ల రోజు అని అన్నారు.. ఖరీదైన స్మార్ట్ ఫోన్, గోల్డ్ చైన్ బహుమతులుగా ప్రేమికులకు ఇవ్వనక్కరలేదు.. కుదిరితే ఓ కన్నీటి చుక్క లేదా ఓ పది రూపాయలు అమర్ జవాన్ నిధికి విరాళం పంపండి అని తెలిపారు .. మధ్యాహ్నం 3 : 15 నిమషాలకు పుల్వామా దాడిలో అసువులు బాసిన దేశ రక్షకులకు ఓ నిముషం మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించి దేశభక్తిని చాటండని ఈ సందర్భంగా తెలియజేసారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్