గోరంట్ల మండలం పాలసముద్రం క్రాస్ వద్ద ఆటో కార్మికులు గురువారం సమావేశం నిర్వహించారు. ట్రాన్స్ పోర్టు రంగం జిల్లా ప్రధాన కార్యదర్శి పెడబల్లి బాబా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మోటార్ వాహనాల చట్టం రద్దు చేయాలన్నారు. కార్మికులకు ఉరితాడు లాంటి ఈ చట్టం వస్తే నష్టపోతారని, వ్యవసాయం రంగం తర్వాత చాలామంది నిరుద్యోగులు ఈ రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్, చేనేత కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.