విడపనకల్ మండలంలో వేరుశనగ విత్తన పంపిణీ ప్రారంభం

58చూసినవారు
విడపనకల్ మండలంలో వేరుశనగ విత్తన పంపిణీ ప్రారంభం
విడపనకల్లు మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో శుక్రవారం వేరుశనగ విత్తన పంపిణీ 40% సబ్సిడీతో రైతులకు పంపిణీ చేస్తున్నట్లు ఏవో పెన్నయ్య తెలిపారు. మండలంలోని అన్ని ఆర్బికేల్లో 765 క్వింటాళ్ల సబ్సిడీ వేరుశనగ రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు. మండల వ్యాప్తంగా 311 మంది రైతులు 264 క్వింటాళ్లకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. వారందరికీ పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్