కుడేరు మండలంలోని పీఏబీఆర్ రిజర్వాయర్ వద్ద ఉన్న శ్రీ సత్యసాయి తాగునీటి పథకం, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకాన్ని గ్రామీణ నీటి సరఫరా శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ మురళీధర్ పరిశీలించారు. నీటి పథకాల్లో మోటర్ల పరిస్థితులు, గ్రామాలకు నీటి సరఫరా గురించి అధికారులతో అరా తీశారు. గ్రామాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా నీటి సరఫరా అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని గురువారం అధికారులను ఆదేశించారు.