ఉరవకొండ పట్టణంలో పలు ప్రైవేట్ పాఠశాలలు ఆదివారం సెలవు దినం అయినప్పటికీ తరగతులను నిర్వహించడంతో విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా కార్యవర్గ సభ్యుడు హరూన్ రషీద్, ఉరవకొండ నియోజకవర్గం ఉపాధ్యక్షులు సురేష్, నాయకులు కరుణాకర్, రాజేష్, నవీన్ కుమార్, సిద్ధార్థ, అభిషేక్, మురళి మాట్లాడుతూ.. విద్యార్థులకు హక్కులకు భంగం కలిగించేలా తరగతులు నిర్వహించడం సరికాదని అన్నారు.