ఉరవకొండ మండల పరిధిలోని బూదగవి గ్రామానికి చెందిన విలేకరి భీమేష్ సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. భీమేష్ మృతి పట్ల సీనియర్ పాత్రికేయులు మాలపాటి శ్రీనివాసులు, దేవరింటి బాలచంద్ర నాయుడు, కురుబ భీమేష్, సుఫీ కరీం తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. భీమేష్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రార్థించారు.