ఉరవకొండలో ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైందని సీఐ మహానంది ఆదివారం తెలిపారు. ఉరవకొండ పట్టణానికి చెందిన చిరంజీవి అనే యువకుడు ప్రేమ పేరుతో ఓ బాలికను వేధిస్తున్నాడు. హెచ్చరించినా అతడి తీరు మారలేదు తరచూ వేధింపులకు గురిచేస్తుండటంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.