గత ప్రభుత్వం విచ్చల విడిగా అప్పులు చేసిందని, ఈ ఏడాది జూన్ నాటికి రూ. 9లక్షల 74వేల కోట్లుగా తేలాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. గురువారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తే చట్టసభల అనుమతితో చేయాలని కానీ గత ప్రభుత్వం చట్టసభల అనుమతి లేకుండా రూ. వందల కోట్లు అప్పు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు.