బెళుగుప్ప మండలం గంగవరం గ్రామంలో గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు శ్రీనివాసులు అనే రైతు పొలంలో ట్రాన్స్ఫార్మర్ వైర్లను తొలగించారు. దుండగులు ట్రాన్స్ఫార్మర్ వైర్లను తొలగించి ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టేందుకు ప్రయత్నిస్తుండగా అటుగా రైతులు వెళ్లడం చూసి వారు పరారయ్యారు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్లను దొంగలిస్తున్న వారిని వెంటనే పట్టుకోవాలని రైతుల కోరారు.