ఉరవకొండ: హంద్రీనీవా కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
వజ్రకరూరు మండలం రాగులపాడు హంద్రీనీవా కాలువలో మృతదేహం లభ్యమైందని ఎస్ఐ నాగస్వామి తెలిపారు. శనివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం హంద్రీనీవా కాలువలో కొట్టుకొచ్చిందని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వజ్రకరూరు పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియనుంది.