భయంతో జీవిస్తున్నాం.. కాపాడండి: మంచు మనోజ్

68చూసినవారు
భయంతో జీవిస్తున్నాం.. కాపాడండి: మంచు మనోజ్
TG: ‘భయంతో జీవిస్తున్నాం.. కాపాడండి’ అని హీరో మంచు మనోజ్ పోలీసులను కోరారు. శనివారం రాత్రి తన కుటుంబంపై దాడి జరిగిందని మనోజ్ ఆరోపించారు. తన తల్లి బర్త్‌డే సందర్భంగా కేక్ ఇచ్చేందుకు విష్ణు, అనుచరులు తన ఇంటికి వచ్చారని తెలిపారు. వెళ్తూ జనరేటర్‌లో పంచదార పోయడం వల్ల పని చేయలేదని ఆరోపించారు. దీంతో రాత్రి కరెంట్ లేక ఇబ్బంది పడ్డానని తెలిపారు. తన కుటుంబం భయంతో జీవిస్తోందని, చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

సంబంధిత పోస్ట్