విద్యుత్ షాక్ తో గేదె మృతి చెందిన సంఘటన ఉరవకొండ పట్టణంలోని రామ్ నగర్ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. మేత మేయడానికి వెళ్లిన ప్రాంతంలో విద్యుత్ తీగ తెగిపోయి కిందకు పడిపోవడంతో అటుగా వెళ్లిన గేదె తీగలను తగలడంతో అక్కడికక్కడే మృతి చెందిందని స్థానికులు తెలిపారు. విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపి వేసి ఘటన స్థలానికి చేరుకుని వైర్ ను తొలగించారు.