ఉరవకొండ: వైభవంగా కార్తీక పౌర్ణమి మహోత్సవం

77చూసినవారు
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి పూజలు శుక్రవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శివాలయాల్లో భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే మహిళలు ఉపవాసాలు ఉండి పూజలు చేస్తున్నారు. పలు ఆలయాల్లో ఆకాశ దీపాలు వెలగించారు. ఉరవకొండ మండలం శ్రీపెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ కార్తీక పౌర్ణమి పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆలయ ధ్వజస్తంభంపై దీపాన్ని వెలిగించారు.

సంబంధిత పోస్ట్