బద్వేల్: "ప్లాస్టిక్ సంచులు వాడితే కఠిన చర్యలు"

77చూసినవారు
బద్వేల్: "ప్లాస్టిక్ సంచులు వాడితే కఠిన చర్యలు"
పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ సంచులను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం బద్వేలు పట్టణ కమిషనర్ నరసింహరెడ్డి హెచ్చరించారు. బద్వేలు పురపాలకలోని పలు హోటళ్లను సిబ్బందితో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పలు హోటల్లో ప్లాస్టిక్ సంచులు బయటపడటంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వాడొద్దని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్