బద్వేల్ మున్సిపాలిటీ కమిషనర్ నరసింహారెడ్డి బుధవారం సాయంత్రం పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారులకు కీలక సూచనలు చేశారు. రహదారులపై వ్యాపారాలు చేయొద్దని తెలిపారు. దీనివల్ల ట్రాఫిక్కు ఇబ్బంది తలెత్తి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రహదారులపై వ్యాపారాలు చేస్తున్న వారిని హెచ్చరించి అటు నుంచి పంపించేశారు.