బద్వేలులో పైప్ లైన్ కు లీకేజీ

51చూసినవారు
కడప జిల్లా బద్వేలులో పైప్ లైన్ కు లీకేజీ ఏర్పడింది. బ్రహ్మ సాగర్ నుంచి గోపవరం మండలంలోని సెంచరీ ప్లైవుడ్ కంపెనీకి నీరు అందించే పైప్లైన్ లీకవడంతో నీరంతా వృథా అవుతోంది. బద్వేలు నుంచి పోరుమామిళ్ళకు వెళ్లే బైపాస్ రోడ్డులో ఈ లీకేజీ ఏర్పడింది. దీంతో నీరంతా పైకి ఎగిసిపడుతోంది. అధికారులు స్పందించి పైపులైనుకు వెంటనే మరమ్మతులు చేయించాలని శుక్రవారం స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్