పోరుమామిళ్ల: తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

56చూసినవారు
పోరుమామిళ్ల: తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
తుఫాను సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి కోరారు. సోమవారం పోరుమామిళ్ల లో ఆయన మాట్లాడుతూ తీవ్రమైన పెనుగాలులు వీచే అవకాశం, పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని తెలిపారు. పశువుల కాపరులు, రైతులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి అవసరమైతే తప్ప బయటకి వెళ్లకుండా ఉండాలని కోరారు. చెట్ల కింద, కరెంటు స్తంభాల కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్