బద్వేల్ పట్టణాన్ని మంగళవారం పొగమంచు కప్పేసింది. ఈ మంచు కారణంగా విద్యార్థులు, ప్రజలు, వివిధ ప్రాంతాల నుంచి వాహనాల్లో వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డిసెంబర్ నెలలో చలి తీవ్రత రోజురోజుకు అధికమవుతునడంతో ఈ మంచు అధికంగా కురుస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి మంచు అధికంగా కురుస్తుండడంతో బద్వేల్ పట్టణ ప్రజలు ముఖ్యంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.