ఎర్రగుంట్ల మండలం చిలమకూరు - ఉప్పలూరు వెళ్లే మార్గంలోని పైపుల ఫ్యాక్టరీ వద్ద విద్యుత్ స్తంభం వంగి ప్రమాదకరంగా మారింది. ఈ మార్గం గుండా వాహనాలు తిరుగుతూ ఉంటాయని స్తంభం వంగిపోవడంతో ఎప్పుడు నేలకొరిగి పడిపోతుందో అని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని విద్యుత్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.