కొండాపురంలో విద్యుత్ కోతలు ఎక్కువగా నిర్వహిస్తున్నారని ఏఐటీయూసీ మండల ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, సుబ్బారావు, విమర్శించారు. శుక్రవారం కొండాపురంలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ.. గత 5 నెల నుంచి ఎక్కువ కరెంటు కోతలు విధిస్తున్నారని, చిన్నవర్షానికే కరెంట్ పోతుందన్నారు. గంటల తరబడి కరెంటు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.