ఎర్రగుంట్ల: ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హమీలు నెరవేర్చాలి

52చూసినవారు
ఎర్రగుంట్ల: ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హమీలు నెరవేర్చాలి
కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎర్రగుంట్లలోని బీసీ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎర్రగుంట్లలో సోమవారం వీరు విలేకరులతో మాట్లాడుతూ. బీసీ రక్షణ చట్టం రూపొందించి వెంటనే అమలు చేయాలని, ఈ ఏడాది రూ. 30 వేల కోట్లు బీసీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలన్నారు. బీసీల ఆర్థిక అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున పారిశ్రామిక రుణాలను ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్