చిలమకూరు పరమేశ్వరుడికి అభిషేకాలు

58చూసినవారు
జమ్మలమడుగు నియోజకవర్గం చిలమకూరు గ్రామంలోని పెనికలపాడు రోడ్డులో ఉన్న శివయ్యకు సోమవారం సాయంత్రం కార్తీకమాసం సందర్భంగా ఆలయ అర్చకులు ప్రదీప్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేయించుకున్నారు. అనంతరం కాయా కర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తర్వాత ఆలయ అర్చకులు భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందించారు.

సంబంధిత పోస్ట్