జమ్మలమడుగులో ఆధార్ సెంటర్ ఏర్పాటు

53చూసినవారు
జమ్మలమడుగులో ఆధార్ సెంటర్ ఏర్పాటు
జమ్మలమడుగు పట్టణ పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఆధార్ కార్డు యందు మార్పులు, చేర్పులు, కొత్త ఆధార్ కార్డులు నమోదు చేసుకునేందుకు ఆధార్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వెంకటరామిరెడ్డి శనివారం తెలిపారు. ముద్దనూరు రోడ్డులోని వార్డు సచివాలయము నందు శనివారం ఆధార్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగ పరుచుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్