చెన్నూరులో కిటికీ కట్ చేసి చోరీ.. 50 గ్రాముల బంగారు అపహరణ

60చూసినవారు
చెన్నూరులో కిటికీ కట్ చేసి చోరీ.. 50 గ్రాముల బంగారు అపహరణ
చెన్నూరులోని పాత్ బ్యాంకు వీధిలో రాజేశ్వరమ్మ ఇంటిలో గుర్తు తెలియని దుండగులు ఇనుప చువ్వలు కత్తిరించి లోనికి ప్రవేశించి ఇంటిని మొత్తం చోరీ చేశారు. బాధితురాలు వివరాల మేరకు తాము ఇంట్లో లేని సమయంలో దుండగులు బీరువాలో ఉన్న సుమారు రూ. 80 వేలు నగదు 50 గ్రాముల బంగారు నగలు, కేజిన్నర వెండి అపహరించారని వాపోయారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్