ఉమ్మడి కడప జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ఉద్యోగ నియామకానికి సంబంధించి పి.ఈ.టి, పి.ఎం.టి స్క్రీనింగ్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు పలు ముఖ్య సూచనలు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్. పి శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో (డి. టి. సి) ఈ నెల 30 వ తేదీ నుండి 2025 జనవరి 8వ తేదీ వరకు పి.ఎం.టి, పి.ఈ.టి పరీక్షలు జరుగుతాయని జిల్లా ఎస్పి తెలిపారు.